Sunamukhi Lehyam

          పొట్ట శుద్ది కి సునాముఖి లెహ్యం

                      

             పొట్ట శుద్దిగా వుంటే ఏ మందు ఐనా త్వరగా పని చెస్తుంది. 

             మలబద్దకం, గ్యాస్, ఆకలి లేమి, కడుపులో చెడు  ఇటువంటి సమస్యలకి సునాముఖి లెహ్యం అద్భుతం గా పని చెస్తుంది.

             ఈ లెహ్యం కడుపులొ వుండే చెడు పొగొడుతుంది.
మనం వేసుకునే టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తాలూకా చేడు ని కూడా పోగొడుతుంది.

కావలసిన పదార్ధాలు:-

        1.  సునాముఖి ఆకుల పొడి --  100గ్రా
        2. నల్ల ఎండు ద్రాక్ష      --          30గ్రా
        3. బాదం పప్పు              --          30గ్రా
        4. పటిక బెల్లం               --          30గ్రా
        5. తేనె                            --        తగినంత


                                                    

తయారు చేసుకునే విధానము:-

        సునాముఖి ఆకుల పొడి, బాదం పప్పు, పటిక బెల్లం, నల్ల ఎండు ద్రక్ష కలిపి మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇలా వచ్చిన మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని, తేనె పోస్తూ లెహ్యం లా వచ్చేలా కలుపుకోవాలి.
ఈ లెహ్యాన్ని ఒక పొడిగా వుండే గాజు సీసాలొ నిల్వ చేసుకోవాలి.

వాడుకొనే విధానం:-

       చిన్న పిల్లల కి శనగ గింజంత, పెద్ద వళ్ళు కుంకుడు గింజంత మొతాదు, రాత్రి పూట పడుకునే ముందు ఈ లేహ్యం తిని ఒక గ్లాసు వెడి నీళ్ళు తాగి పడుకొవాలి.
   రొజూ వెసుకొవటం వల్ల మంచి ఫలితాలు వస్థాయి.
   రొజూ వాడటం  వీలు కాని వారు నెలకి 4 సార్లు వాడుకొవచ్చు.




సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

No comments:

Post a Comment