5 నిమిషాలలో గ్యాస్ ని తగ్గించే ఔషదం
మషాలా పదార్ధాలు తిన్నా, నాన్-వెజ్ తిన్నప్పుడుకాని, ఏదైనా హెవీ గా తిన్నప్పుడు, పొట్ట బరువుగా, ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది, ఇది కూడా గ్యాస్ లక్షణమే.
ఇప్పుడు మనం తయారుచేయబోయే మందు, గ్యాస్ నుండి నిమిషాలలోనే విముక్తి కలిగిస్తుంది.
హెవీ గా తిన్నప్పుడే వాడాలా విడిగా వాడకూడదా అనుకుంటారేమో, ఎలా ఐన వాడుకోవచ్చు.
రోజు ఉదయాన్నే, పరగడుపున 1 స్పూన్ పొడి నోట్లో వేసుకుని నిదానంగా చప్పరించి, అర గంట వరకు ఏమి తినకుండా ఉంటె, గ్యాస్ సమస్య నుంచి పూర్తిగా, విముక్తులవుతారు.
కావలసిన పదార్ధాలు:
1. వాము 50గ్రా
2. సైoదవ లవణం 1 టేబుల్ స్పూన్
3. నిమ్మ రసం
తయారీ విధానం:
వాముని శుభ్రంచేసుకుని, దోరగా వేయించుకోవాలి. చల్లారనివ్వాలి.
చల్లారిన తరువాత ఒక ప్లేట్ లో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సైoదవ లవణం చల్లి, ఆ మిశ్రమం మునిగే వరకు నిమ్మరసం పోయాలి.
ఈ మిశ్రమం మొత్తాన్ని, 3 రోజులు నీడలో, ఇంట్లోనే తడి తగలని చోట ఆరబెట్టాలి, 3 రోజులు నీడలో ఆరిన తరువాత, మూడు నుంచి నాలుగు రోజులు ఎండలో ఆరబెట్టాలి .
బాగా ఆరిపోయిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మంచిది.
ఒక స్పూను పొడిని ఉదయం పరగడుపున, సాయంత్రం భోజనానికి 30 నిమిషాలు ముందు తినాలి.
సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.
No comments:
Post a Comment