How to increase blood naturally || రక్త వృద్ధి కి టమాటో జ్యూస్ || Raktham pattataniki ||

చాలామందికి రక్తం లేదు, రక్తం తక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళకి 45 సం|| దాటినా తరువాత సహజం గా వచ్చే ప్రాబ్లెమ్ కూడా,
అలాగేపిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. 
ఎలా వచ్చినప్పటికీ ఈ సమస్యకి మందులు వాడేకంటే సహజం గా చాల రకాలుగా తగ్గించు కోవచ్చు. మనకి కావాల్సినంత బ్లడ్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

కావలసిన పదార్ధాలు:

టమాటో రసం   --------     1/2 కప్ 

నిమ్మరసం     -------           1 స్పూను

అల్లం రసం  -------------     1 స్పూను 

మిరియాల పొడి -----          1 చిటికెడు 


టమాటో లని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి, ఒక 1/2 కప్ టమాటో రసం లో 1స్పూను నిమ్మరసం, 1 స్పూను  అల్లం రసం, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి త్రాగాలి.

రక్తం మరీ తక్కువ ఉంటె 1కప్ జ్యూస్ త్రాగండి, మీడియం గా ఉంటె 1/2 కప్ సరిపోతుంది. 

పొద్దున కానీ సాయంత్రం కానీ ఎదో ఒక పూట త్రాగండి. 

నోట్: టమాటో రసం అనగానే, మిక్సీలో టమాటో వేసి వడపోసిస్తు ఉంటారు, ఆలా చెయ్యొద్దు. వాడపొయ్యొద్దు మిక్సీ వేసి ఆహ్ మొత్తం ని, కప్  లోకి తీసుకోండి.



పార్శ్వ తల నొప్పి కి అద్భుతమైన చిట్కాలు || parshwa thalanppi, Thalanoppi || partial Headache

                       పార్శ్వ తల నొప్పి




మొదటి చిట్కా:

1.  అర  లీటరు నీళ్ళల్లో , 60గ్రా  పటికబెల్లం వేసి, రాత్రి పడుకునే ముందు ఆ చెంబు ని,       మంచం కింద పెట్టాలి, పొద్దున 5.00 గంటలకు లేచి, పళ్ళు తోముకుని, ఈ  నీళ్ళని త్రాగాలి.


రెండవ చిట్కా:

1. కరక్కాయ పొడి    ----     100 గ్రా

2. తానికాయ పొడి   -----     200 గ్రా 

3. ఉసిరికాయ పొడి  -----   400గ్రా 

4. పటికబెల్లం పొడి     --     700 గ్రా


నోట్: కరక్కాయలని,  4 చుక్కలు నాటు ఆవు నెయ్యి వేసి, దోరగా వేయించి పొడి చేసుకోవాలి. తాని కాయలను కూడా ,  4 చుక్కలు నాటు ఆవు నెయ్యి వేసి, దోరగా వేయించి పొడి చేసుకోవాలి.

ఉసిరి కాయలను మాత్రం ఎండబెట్టి పొడి చేసుకోవాలి.


తయారీ విధానం:

ఈ పొడులన్నీ కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి, ఉదయం పరగడుపున, రాత్రి నిద్రపోయేముందు,  పిల్లలకి పావు టీ స్పూను, పేదవాళ్లు అర టీ స్పూను పొడిని తిని, గోరు వెచ్చని నీళ్లు  త్రాగాలి.


పార్శ్వ తలనొప్పి  శాశ్వతం గా తగ్గిపోతుంది.

Tips to increase bone strength

ఎముకల  పటిష్టత కు ఔషధాలు


ఎముకలకు పటిష్టత, ఎముకులకు బలం కొరకు ఏ ఔషదాలు అద్భుతం గా పనిచేస్తాయి.

కావలసినపదార్ధాలు:

1. నల్ల నువ్వుల పొడి       --  5గ్రా 

2. శతావరి                          --   3గ్రా 

3. శొంఠి పొడి                      --  3గ్రా 

4. పటికబెల్లం పొడి          --   5గ్రా 

ఈ పొడులన్నీ కలిపి తిని ఒక గ్లాసు పాలు త్రాగాలి, లేదా పాలలో  ఈ పొడులన్నీ వేసి కలిపి త్రాగవచ్చు.
ఈ మోతాదులు ఒక పూటకి  సరిపోయేది మాత్రమే.





సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చేయండి.


మా youtube  ఛానల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.youtube.com/channel/UCqpoQfFYViQ6rIVrhSnyJdA?sub_confirmation=1

Remedy for Respiratory Diseases || Remedy For Swasakosa vyadulu

శ్వాసకోశ వ్యాధుల నివారణకు,  కొంచెం నడవగానే ఆయాసం గా ఊపిరి ఆడనట్లుగా ఉండటం.


కావలసిన పదార్ధాలు:

1. తులసి ఆకులు     - 10.

2.  మిరియాలు       - 2.

3. అల్లం ముక్కలు  - 2గ్రా.

4. పటిక బెల్లం పొడి   - 1 స్పూను.

తయారీవిధానం:

స్టవ్ వెలిగించి ఒక పాత్ర  పెట్టి, ఒక గ్లాసు నీరు పోసి, ఆ నీళ్ళల్లో తులసి ఆకులు, మిరియాలు, అల్లం ముక్కలు వేసి,  అర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి. 

అర  గ్లాసు అయ్యాక 1స్పూను పటికబెల్లం పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్  చేసెయ్యాలి.

 ఈ కషాయాన్ని మనం ఎంత వేడి అయితే త్రాగగలమొ అంత వేడి వరికు  చల్లార్చి త్రాగాలి. ఉదయం, సాయంత్రం త్రాగాలి.  

త్రాగిన తరువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు, త్రాగకూడదు.

అన్ని రకాల శ్వాశకోశ వ్యాధులు తగ్గిపోతాయి, మరియు కొంచెం దూరం నడవగానే ఆయాసం గా ఊపిరి అందినట్లు గా ఉంటుంది, అలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.