శ్వాసకోశ వ్యాధుల నివారణకు, కొంచెం నడవగానే ఆయాసం గా ఊపిరి ఆడనట్లుగా ఉండటం.
కావలసిన పదార్ధాలు:
1. తులసి ఆకులు - 10.
2. మిరియాలు - 2.
3. అల్లం ముక్కలు - 2గ్రా.
4. పటిక బెల్లం పొడి - 1 స్పూను.
తయారీవిధానం:
స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి, ఒక గ్లాసు నీరు పోసి, ఆ నీళ్ళల్లో తులసి ఆకులు, మిరియాలు, అల్లం ముక్కలు వేసి, అర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి.
అర గ్లాసు అయ్యాక 1స్పూను పటికబెల్లం పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి.
ఈ కషాయాన్ని మనం ఎంత వేడి అయితే త్రాగగలమొ అంత వేడి వరికు చల్లార్చి త్రాగాలి. ఉదయం, సాయంత్రం త్రాగాలి.
త్రాగిన తరువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు, త్రాగకూడదు.
అన్ని రకాల శ్వాశకోశ వ్యాధులు తగ్గిపోతాయి, మరియు కొంచెం దూరం నడవగానే ఆయాసం గా ఊపిరి అందినట్లు గా ఉంటుంది, అలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
No comments:
Post a Comment