Remedy For Jalubu Dhaggu Guraka

                       జలుబు, దగ్గు, గురక

అన్ని కాలాలలో వచ్చే జలుబు కి ఈ కషాయం అద్భుతం గా పని చేస్తుంది.

కేవలం జలుబుకి మాత్రమే కాకుండా, జలుబు దగ్గు, గొంతునొప్పి, జలుబు వల్ల  వచ్చే అన్ని లక్షణాలకి ఈ  కషాయం పని చేస్తుంది.
 చాలామందికి గురక ఒక పెద్ద సమస్య, తమరు పెట్టె గురక వల్ల, పక్కన వారికి సమస్య, ఈ కషాయం రోజు సేవించటం వల్ల గురక కూడా తగ్గిపోతుంది.

దీనిని ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.


కావలసిన పదార్ధాలు:

తులసి ఆకులు        10

మిరియాలు               10

అల్లం                  చిన్న ముక్క (1 అంగుళం ముక్క)

పటికబెల్లం              1.5 స్పూన్ 


తయారీ విధానం:

అల్లం ముక్క పైన పెచ్చు తీసేసి, కడిగి, చిన్న రోలు లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి, దానిలో 10 మిరియాలు, 10 తులసిఆకులు వేసి మూడు కలిసేలాగా దంచాలి, మెత్తగా దంచనవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలు.

స్టవ్ వెలిగించి, ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో, ఈ నూరిన మిశ్రమం వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ లో, మరగనివ్వాలి.
గ్లాస్ నీరు, అర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి,  అరగ్లాసు అయ్యాక, ఒకటిన్నర స్పూను పటికబెల్లం వేసి, అది కరిగేవరకు మెల్లగా కలపాలి.
పటికబెల్లం కరిగిన తరువాత, ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి.

ఈ కషాయం టీ గ్లాసు మోతాదు అవుతుంది, ఈ కషాయాన్ని ఉదయం పరగడుపున త్రాగాలి .
జలుబు ఎక్కువగా ఉంటె సాయంత్రం కూడా త్రాగాలి. వేడి వేడిగా టీ తగినట్లు త్రాగాలి.

త్రాగిన తరువాత, ఒక గంట వరకు ఏమి తినకూడదు త్రాగ కూడదు. కాళ్ళు , చేతులు కూడా  కడగకూడదు.


సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

No comments:

Post a Comment