Remedy for Toothache

          పంటి నొప్పికి  పరిష్కారం





పంటి నొప్పి కి అనేక రకాల కారణాలు ఉండొచ్చు, కానీ పరిష్కారం మాత్రం ఈ సింపుల్  చిట్కా నే.
ఎంతటి వేధించే పంటి నొప్పిఅయునా, 15 నిమిషాల లోపు తగ్గించేస్తుంది.

 తయారీ విధానం:

 స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకుని, దాంట్లో 1 గ్లాసు నీళ్లు పోసి 2 స్పూన్ల కళ్ళు ఉప్పు వేసి, గోరువెచ్చగా కాయాలి,  ఎక్కువ వేడి వద్దు గోరువెచ్చ గా  సరిపోతుంది.

ఈ  నీటిని కొద్దీ కొద్దిగా పొక్కిట  పట్టి, ఉసెయ్యండి.
పంటినొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.




సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

Instant remedy for Gas

    5 నిమిషాలలో గ్యాస్ ని తగ్గించే ఔషదం





మషాలా పదార్ధాలు తిన్నా, నాన్-వెజ్ తిన్నప్పుడుకాని, ఏదైనా హెవీ గా  తిన్నప్పుడు, పొట్ట బరువుగా, ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది, ఇది కూడా గ్యాస్ లక్షణమే.
ఇప్పుడు మనం తయారుచేయబోయే మందు, గ్యాస్ నుండి  నిమిషాలలోనే విముక్తి కలిగిస్తుంది.

హెవీ గా తిన్నప్పుడే వాడాలా విడిగా వాడకూడదా అనుకుంటారేమో, ఎలా ఐన వాడుకోవచ్చు.
రోజు ఉదయాన్నే, పరగడుపున 1 స్పూన్ పొడి నోట్లో వేసుకుని నిదానంగా చప్పరించి, అర  గంట వరకు ఏమి తినకుండా ఉంటె, గ్యాస్ సమస్య నుంచి పూర్తిగా, విముక్తులవుతారు. 

 కావలసిన పదార్ధాలు:

1. వాము    50గ్రా 

2. సైoదవ లవణం   1 టేబుల్ స్పూన్ 

3. నిమ్మ రసం 



తయారీ విధానం:

వాముని శుభ్రంచేసుకుని, దోరగా వేయించుకోవాలి. చల్లారనివ్వాలి. 
చల్లారిన తరువాత ఒక ప్లేట్ లో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సైoదవ లవణం చల్లి, ఆ మిశ్రమం మునిగే వరకు నిమ్మరసం పోయాలి. 

ఈ మిశ్రమం మొత్తాన్ని, 3 రోజులు నీడలో, ఇంట్లోనే తడి తగలని చోట ఆరబెట్టాలి, 3 రోజులు నీడలో ఆరిన తరువాత, మూడు  నుంచి నాలుగు రోజులు ఎండలో ఆరబెట్టాలి . 

బాగా ఆరిపోయిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. 
ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మంచిది.

ఒక స్పూను పొడిని ఉదయం పరగడుపున, సాయంత్రం భోజనానికి 30 నిమిషాలు ముందు తినాలి.


సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

Remedy for Anemia || Raktha heenatha

                    రక్తహీనత ఎనీమియా

రక్తం తక్కువ గా ఉన్నవారికి అద్భుతమైన రెమెడీ.

ఇది రోజు త్రాగితే మనశరీరానికి ఎంత రక్తం అవసరమో అంత రక్తాన్ని సమకూరుస్తుంది, రక్తాన్ని శుద్ధి  చేస్తుంది.

ఎలా తాయారు చేసుకోవాలో చూద్దాం.


కావలసిన పదార్ధాలు:

పాలు                                      టీ గ్లాసు మోతాదు 

నల్ల ఎండు ద్రాక్ష                  10

పటికబెల్లం                           తీపికి సరిపడినంత.



తయారీ విధానం:

 చేసి ఒక గిన్నె పెట్టి , ఆ టీ గ్లాసు పాలు పోసి, 10 నల్ల ఎండుద్రాక్ష ని తుంచి ఆ పాలల్లో వెయ్యాలి , 2 నుంచి 3 నిమిషాలపాటు మరిగించాలి. మరిగిన తర్వాత మీకు ఎంత తీపి కావాలో అంత పటికబెల్లం వేసి స్టవ్ ఆఫ్  చేసెయ్యాలి, ఆ పాతిక బెల్లం కరిగేవరకు నిదానం గా కలుపుకోవాలి.  పటికబెల్లం కరిగిపోయాక ఒక గ్లాస్లో పోసుకోవాలి.

ఆ ద్రాక్ష తింటూ, పాలు త్రాగాలి . పొద్దున్నే పరగడుపున త్రాగాలి. త్రాగిన తరువాత  ఒక గంటవరకు ఏమి తినకూడదు. ఇలా 40 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.



సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

Remedy For Jalubu Dhaggu Guraka

                       జలుబు, దగ్గు, గురక

అన్ని కాలాలలో వచ్చే జలుబు కి ఈ కషాయం అద్భుతం గా పని చేస్తుంది.

కేవలం జలుబుకి మాత్రమే కాకుండా, జలుబు దగ్గు, గొంతునొప్పి, జలుబు వల్ల  వచ్చే అన్ని లక్షణాలకి ఈ  కషాయం పని చేస్తుంది.
 చాలామందికి గురక ఒక పెద్ద సమస్య, తమరు పెట్టె గురక వల్ల, పక్కన వారికి సమస్య, ఈ కషాయం రోజు సేవించటం వల్ల గురక కూడా తగ్గిపోతుంది.

దీనిని ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.


కావలసిన పదార్ధాలు:

తులసి ఆకులు        10

మిరియాలు               10

అల్లం                  చిన్న ముక్క (1 అంగుళం ముక్క)

పటికబెల్లం              1.5 స్పూన్ 


తయారీ విధానం:

అల్లం ముక్క పైన పెచ్చు తీసేసి, కడిగి, చిన్న రోలు లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి, దానిలో 10 మిరియాలు, 10 తులసిఆకులు వేసి మూడు కలిసేలాగా దంచాలి, మెత్తగా దంచనవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలు.

స్టవ్ వెలిగించి, ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో, ఈ నూరిన మిశ్రమం వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ లో, మరగనివ్వాలి.
గ్లాస్ నీరు, అర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి,  అరగ్లాసు అయ్యాక, ఒకటిన్నర స్పూను పటికబెల్లం వేసి, అది కరిగేవరకు మెల్లగా కలపాలి.
పటికబెల్లం కరిగిన తరువాత, ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి.

ఈ కషాయం టీ గ్లాసు మోతాదు అవుతుంది, ఈ కషాయాన్ని ఉదయం పరగడుపున త్రాగాలి .
జలుబు ఎక్కువగా ఉంటె సాయంత్రం కూడా త్రాగాలి. వేడి వేడిగా టీ తగినట్లు త్రాగాలి.

త్రాగిన తరువాత, ఒక గంట వరకు ఏమి తినకూడదు త్రాగ కూడదు. కాళ్ళు , చేతులు కూడా  కడగకూడదు.


సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

Remedy for Gas || Ulcer || alsar ||

                Remedy for Gas, Ulcer

  గ్యాస్ అల్సర్ ని తగ్గించగల ఆహర ఔషదం


గ్యాస్ అల్సర్ తొ బాధపడేవాళ్ళకి అద్భుతమైన ఔషదం ఎలా తయరు చేసుకోవాలొ ఇక్కడ పోస్ట్ చేసాను.

క్రింద వీడియో లో ఎలా తయారుచేసుకోవాలో క్లియర్ గా చేసి చూపించాను.

                                                                                     


కావలసిన పదార్ధాలు:

1. నువ్వులు
2. పాత బెల్లం
3. అల్లం


స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అది కొంచెం హీట్ అవ్వగానే నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి, చల్లారనివ్వాలి.
చల్లారిన నువ్వులేని మిక్సీ పట్టుకోవాలి, నువ్వులు మిక్సీ పట్టిన పొడిని, ఒక గాజు సీసా లో నిల్వ ఉంచుకోవాలి. నువ్వులు ఎన్ని గ్రాములో చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా, మీ అవసరాన్ని బట్టి మీరే ఒక పావు కిలో కానీ అర కిలో కానీ తీసుకోండి. పొడి గాజుసీసా లో నిల్వ చేసుకోండి. 

ఇప్పుడు మందు ఎలా చెయ్యాలో చుడండి:

ఒక చిన్న రోలు తీసుకోండి , 1 అంగుళం అల్లం ముక్క పైన పెచ్చు తీసేసి, కడిగి, ఆ రోలు లో వెయ్యండి, ఆ అల్లం ముక్కని మెత్తగా దంచండి. 
ఒకటిన్నర స్పూన్ల పాత బెల్లం పొడిని వెయ్యండి. వీలైనంత వరకు పాత బెల్లం వాడండి, పాత బెల్లం దొరకని పక్షం లో మామూలు బెల్లం వాడుకోవచ్చు. అల్లము బెల్లము కలిసేలాగా మేత గా నూరండి. అల్లం, బెల్లం బాగా కలిసాక, నువ్వులు పొడి ఒకటిన్నర స్పూన్ వేసి బాగా నూరండి.
మొత్తం కలిసిపోవాలి అలా నూరుకోండి.
రెండు ఉండలు లాగా చేసుకోండి.
ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకోవాలి ఈ  ఉండలని.

పొద్దున్నే పరగడుపున అంటే బ్రష్ చేసిన తరువాత ఏమి తినకుండా, ఈ ఉండ ని తినాలి. మరల సాయంత్రం భోజనానికి గంట ముందు ఇంకో ఉండ తినాలి. పొద్దున చేసిన ఉండ సాయంత్రం వరకు నిల్వ ఉంటుంది. ఇవి తిన్న తరువాత గంటవరకు ఏమి తినకుండా ఉంటె బాగా పని చేస్తుంది.

ఒక వేళ ఇద్దరు తినవలసి వస్తే 2 అంగుళాల అల్లం, మూడు స్పూన్ల బెల్లం పొడి, మూడు  స్పూన్ల నువ్వుల పొడి వేసి చేసుకొని నాలుగు ఉండలు చేసుకోండి.

40 రోజులు క్రమం తప్పకుండ తినండి. గ్యాస్ సమస్యే ఉండదు మీకు.


సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.